ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Best Teacher Award | ఉత్తమ ఉపాధ్యాయుడిగా బోర్గా(పి) జెడ్పీహెచ్​ఎస్​ హెచ్​ఎం శంకర్​

    Best Teacher Award | ఉత్తమ ఉపాధ్యాయుడిగా బోర్గా(పి) జెడ్పీహెచ్​ఎస్​ హెచ్​ఎం శంకర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో భాగంగా నగరంలోని బోర్గాం(పి) జెడ్పీహెచ్​ఎస్​ ప్రధానోపాధ్యాయుడు శంకర్​ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా (State level Best teacher award) ఎంపికయ్యారు.

    బోర్గాం జెడ్పీహెచ్​లో విధులు నిర్వహిస్తున్న శంకర్​ 1997లో సామాన్యశాస్త్రంలో స్కూల్​ అసిస్టెంట్​గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి రామన్నపేట్​​, పెర్కిట్​, ఎర్గట్ల, ఎడపల్లి, హొన్నాజీపేట్​ పాఠశాలల్లో పనిచేశారు. ప్రస్తుతం బోర్గాం(పి) స్కూల్​లో హెచ్​ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

    Best Teacher Award | రెండేళ్లలో ఒకటి,రెండు సెలవులు మాత్రమే తీసుకుని..

    బోర్గాం(పి) జెడ్పీహెచ్​ఎస్​లో (Borgam(P) ZPHS) హెచ్​ఎంగా పనిచేస్తున్న శంకర్​ గత రెండేళ్లుగా కేవలం ఒకటి, రెండు లీవులు మాత్రమే తీసుకుని మిగితా సమయాన్ని పాఠశాలకే కేటాయించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ పనిచేసినా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ శంకర్​ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా హెచ్​ఎం శంకర్​ మాట్లాడుతూ.. బోర్గాం(పి) జెడ్పీహెచ్​ఎస్​ను అభివృద్ధి చేసేందుకు తోటి ఉపాధ్యాయులు సహకరిస్తున్నారని.. తనకు అవార్డు రావడంలో తోటి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. అలాగే హెచ్​ఎం శంకర్​కు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు రావడంతో తోటి ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    More like this

    Helicopter to exam center | హెలికాప్టర్​లో ఎగ్జామ్ సెంటర్​కు స్టూడెంట్స్.. అద్దెకు తీసుకుని మరీ..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helicopter to exam center : ఇటీవల ఓ విద్యార్థిని తాను చదివే విద్యాసంస్థకు గుర్రంపై...

    Lambodharudi laddu | 333 కిలోల లంబోధరుడి లడ్డూ.. రూ. 99 కే దక్కించుకున్న విద్యార్థి

    అక్షరటుడే, హైదరాబాద్: Lambodharudi laddu : గణేశ్​ నిమజ్జన శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Devotee collapses while dancing | వినాయక శోభాయాత్రలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భక్తుడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Devotee collapses while dancing : వివాహాలు, శుభకార్యాలు, ఊరేగింపులు.. వేడుక ఏదైనా DJ సౌండ్...