ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ హృదయవిదారక ఘటనకి సంబంధించి పూర్తి న్యాయం జరగాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేసును మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించేందుకు చర్యలు ప్రారంభించారు.

    ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌కు (CBI director) లేఖ రాయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ రోజే ఆ లేఖ పంపించాలని సూచించారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కీలకంగా చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ పాలనలో సీబీఐకి అప్పగించిన ఈ కేసులో దర్యాప్తు గణనీయంగా ముందుకు సాగలేదని అభిప్రాయపడ్డారు.

    CM Chandrababu | అసత్య ప్రచారాలపై సీరియస్

    సమావేశంలో సీఎం చంద్రబాబు (Chandra Babu Naidu) మరో కీలక అంశంపై స్పందించారు. యూరియా సరఫరా విషయంలో వ్యాప్తి చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. మన వద్ద యూరియా సమృద్ధిగా ఉంది, అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి అని అన్నారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై నియంత్రణ కలిగించే విధంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కుప్పాలో కాలువలకు నీరు రావడంలేదని వచ్చిన ఆరోపణలను తప్పుబట్టిన చంద్రబాబు, ఇది అసత్య ప్రచారం, ప్రజల్లో నమ్మకం కలిగే ముందు దాన్ని ఆపాలి అని మంత్రులకు సూచించారు. ప్రభుత్వ పరంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ మీడియా అడ్మిన్లకు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు.

    ఇక భవనాల క్రమబద్ధీకరణ విషయంలో సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు భవనాలు నిర్మించి ఆ తర్వాత క్రమబద్ధీకరించమంటారా? ఇకపై అలాంటి వ్యవహారాలకు తావు ఉండదు అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ ప్రచారాన్ని బలోపేతం చేసేందుకు సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమాన్ని (Super Six – Super Hit program) సెప్టెంబర్ 10న నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

    కాగా సుగాలి ప్రీతి కేసు నేపథ్యం చూస్తే.. 2017 ఆగస్టు 18న కర్నూలులోని ఓ ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో ప్రీతి మృతదేహం సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. అప్పటి నుంచి కేసు వివిధ మలుపులు తిరిగి, తుది దశలో న్యాయం జరగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయంతో కేసు ప‌రుగులు పెట్టే అవ‌కాశం ఉంది.

    More like this

    September 7 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 7 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 7,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...