ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​West Godavari | వినాయ‌క నిమ‌జ్జ‌నంలో అశ్లీల నృత్యాలు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న హిందూ సంఘాలు

    West Godavari | వినాయ‌క నిమ‌జ్జ‌నంలో అశ్లీల నృత్యాలు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న హిందూ సంఘాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: West Godavari | ఆంధ్రప్రదేశ్‌లో రికార్డింగ్ డ్యాన్సులు (Recording Dance), ప్రత్యేకంగా అశ్లీల నృత్యాలు, రోజురోజుకు పెరిగిపోతుండడంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    నిబంధనలకు విరుద్ధంగా పండుగలు, ఉత్సవాలు, వివాహాల పేరుతో ఈ డ్యాన్సుల నిర్వహణ పరిపాటిగా మారిన వేళ, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో (West Godavari district) చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. నల్లజర్ల మండలంలోని తేలికచర్ల గ్రామంలో (Telikacherla village) వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో అశ్లీల డ్యాన్సులు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

    West Godavari | ఇదేం పాడు ప‌ని..

    వీడియోల ప్రకారం, అసభ్య దుస్తులు ధరించిన యువతులు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని ‘కెవ్వు కేక’ సాంగ్‌కు అసభ్యంగా నృత్యాలు చేశారు. ఈ నేపథ్యంలో యువకుల హడావుడి ఓ రేంజ్‌లో ఉంది. వీటికి సంబంధించి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి ప్లాట్‌ఫాంలలో వీడియోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ అసభ్యకర చర్యపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. “ఇది వినాయక చవితి (Vinayaka Chaviti) వంటి పవిత్ర పండుగను అపవిత్రం చేసిన చర్య”, “సంప్రదాయాలను తుంగ‌లోకి తొక్కే చర్య” అంటూ పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు.

    వీడియోలు వైరల్ (Video Viral) కావడంతో నల్లజర్ల పోలీసులు (Nallajarla police) వెంటనే స్పందించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధ్యుల్ని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.పోలీసుల ప్రకారం, కార్యక్రమానికి అనుమతి తీసుకున్న వివరాలు, డీజే నిర్వహణపై ఉన్న నిబంధనలు, అశ్లీల ప్రదర్శనలపై నిషేధం అంశాలపై విచారణ జరుపుతున్నారు.

    ప్రకాశం, గుంటూరు (Guntur), పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సులు, డీజే ఈవెంట్లు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో ఉత్సవాల సందర్భంగా సంప్రదాయ కార్యక్రమాల పేరిట ఇలా సాంస్కృతిక వేడుకల పేరుతో అసభ్యకర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానికులు, పెద్దలు, కమిటీలు కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే, ఇది సాంస్కృతిక విధ్వంసానికి దారితీయవచ్చు.

    More like this

    September 7 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 7 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 7,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...