ePaper
More
    HomeతెలంగాణGanesh immersion | హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు

    Ganesh immersion | హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh immersion | హైదరాబాద్​ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు (Ganesha Chavithi celebrations) ఘనంగా కొనసాగుతున్నాయి. మండపాల్లో ప్రత్యేక పూజలు అందుకుంటున్న గణనాథుడిని ఈ నెల 6న నిమజ్జనం చేయనున్నారు.

    భాగ్యనగరంలో గణేశ్​ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారు. ముఖ్యంగా ఖైరతాబాద్​ వినాయకుడి శోభాయత్రకు (Khairatabad Ganesha Shobhayatra) భారీగా భక్తులు తరలివస్తారు. ట్యాంక్​బండ్​ పరిసరాలు జనసంద్రంగా మారుతాయి. హుస్సేన్​ సాగర్​తో పాటుతో నగరంలోని పలు చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.

    Ganesh immersion | 50 వేల విగ్రహాలు

    నగరంలో శనివారం సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 303 కి.మీ.ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. లక్షలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొననుండటంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. నిమజ్జనం సందర్భంగా 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.

    Ganesh immersion | 20 చెరువుల్లో..

    నగరంలోని 20 చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే 72 కృత్రిమ కొలన్లను సైతం సిద్ధం చేశారు. భారీ వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 134 క్రేన్లు, 259 మొబైల్‌ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్​ సాగర్​లో (Hussain Sagar) వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. దీంతో అక్కడ 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. శోభాయాత్రలో శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని కేటాయించారు.

    More like this

    CM Revanth Reddy | విపత్తుల నిర్వహణలో కామారెడ్డి మోడల్​గా నిలవాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | వరదలకు సంబంధించి అంచనాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు...

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ...