ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Vinayaka Chavithi | ఇందూరులో ప్రారంభమైన గణేష్​ నిమజ్జనోత్సవాలు

    Vinayaka Chavithi | ఇందూరులో ప్రారంభమైన గణేష్​ నిమజ్జనోత్సవాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Chavithi | వినాయకుల ఉత్సవాల్లో భాగంగా గురువారం 9వ రోజు కావడంతో గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు (ganesh Nimajjanam) ప్రారంభమయ్యాయి.

    నగరంలోని వినాయక్ నగర్​లో (Vinayak nagar) ఉన్న బావి వద్దకు (ganapathula Bavi) భక్తులు తరలివస్తున్నారు. ఈనెల 7న చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో చాలామంది గురువారమే వినాయక నిమజ్జన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

    Vinayaka Chavithi | నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు

    ఇదిలా ఉండగా సార్వజనిక్​ గణేష్ మండలి (Sarvajanik Ganesh Mandali) ఆధ్వర్యంలో అనంత చతుర్దశి శనివారం రోజు వినాయకులను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బ నుంచి ప్రారంభమయ్యే గణపతి రథయాత్రకు సంబంధిత శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.

    దుబ్బ (Dubba), లలితా మహల్ థియేటర్ (Lalita Mahal Theatre), గాంధీ చౌక్ (gandhi Chowk), నెహ్రూ పార్క్ (nehru Park) అహ్మదీబజార్, గాజుల్ పెట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్, పులాంగ్ మీదుగా వినాయక్​నగర్​లోని వినాయకుల బావి వరకు రథయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే లైటింగ్, రోడ్డుకు ఇరువైపులా శానిటేషన్ వర్క్, మొరం పనులను చేయిస్తున్నారు. బావి వద్ద నగరపాలక సంస్థ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్యులను అందుబాటులో ఉంచారు.

    వినాయక్​నగర్​లోని గణపతుల బావిలో గణనాథులను నిమజ్జనం చేస్తున్న భక్తులు

    మధవనగర్​ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్​ కమిషనర్​ దిలీప్​కుమార్​

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...