అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Madras IIT | దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఎప్పటిలాగే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్, ఇంజినీరింగ్ విభాగాల్లో నంబర్‌వన్ ర్యాంక్(Number One Rank)ను కైవసం చేసుకుంది.
వర్సిటీలు, కాలేజీలు, ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన నాలుగు జాబితాల్లో తెలంగాణ నుంచి ఒక్క హైదరాబాద్ ఐఐటీ(Hyderabad IIT)కి మినహా మిగతా వర్సిటీలు, కాలేజీలకు చోటు దక్కలేదు.
Madras IIT | టాప్‌లో బెంగళూరు సైన్స్ ఇనిస్టిట్యూట్
దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రత్యేక సంస్థల జాబితా నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2025ను కేంద్రం గురువారం విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Education Minister Dharmendra Pradhan) ఈ జాబితాలను విడుదల చేశారు. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలను మూల్యాంకనం చేయడానికి ఈ ర్యాంకింగ్స్ కీలకమైన ప్రమాణంగా పని చేస్తాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు దేశంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్, లా, కొత్తగా ప్రవేశపెట్టిన విభాగాలతో సహా బహుళ విభాగాలలో ర్యాంకింగ్‌లను ఆవిష్కరించి మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ప్రకటన చేశారు.
Madras IIT | టాప్ -10 ఐఐటీలు ఇవే..
NIRF ర్యాంకింగ్స్‌లో పది అత్యుత్తమ ఐఐటీలలో మద్రాస్ ఐఐటీ(Madras IIT )తొలి స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు రెండో స్థానంలో, బాంబే ఐఐటీ మూడో స్థానానికి పరిమితమయ్యాయి. ఇక, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, ఎయిమ్స్ ఢిల్లీ, జేఎన్‌యూ, బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
Madras IIT | టాప్-10 వర్సిటీలు..
ఇకే దేశంలో అత్యుత్తమ వర్సిటీల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు టాప్ ప్లేస్ సాధించింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెండు,మూడు స్థానాలలో నిలిచాయి. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ, అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీఘర్ టాప్-10 వర్సిటీల్లో చోటు దక్కించుకున్నాయి.
Madras IIT | ఏడో స్థానంలో హైదరాబాద్ ఐఐటీ
ఇంజినీరింగ్ విభాగం(Engineering Department)లో హైదరాబాద్ ఐఐటీకి ఏడో స్థానం దక్కింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT మద్రాస్) అగ్రస్థానం దక్కించుకుంది. ఐఐటీ, ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ తొలి ఆరు స్థానాల్లో నిలిచాయి.ఐఐటీ గౌహతి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BHU) వారణాసి టాప్-10 జాబితాలో చోటు సంపాదించాయి. కళాశాలల వారీగా చూస్తే.. హిందూ కళాశాల, ఢిల్లీ తొలి స్థానం సంపాదించుకోగా, మిరాండా హౌస్, ఢిల్లీ, హన్స్ రాజ్ కళాశాల, ఢిల్లీ వరుసగా రెండు, మూడో స్థానంలో నిలిచాయి.
Madras IIT | సత్తాచాటుతున్న మద్రాస్ ఐఐటీ
ఐఐటీ మద్రాస్ అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శించింది, 2016లో NIRF ర్యాంకింగ్‌లను మొదటిసారి ప్రవేశపెట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం అగ్రస్థానాన్ని దక్కించుకుంది.వరుసగా ఏడవ సంవత్సరం కూడా భారతదేశంలో అత్యుత్తమ మొత్తం సంస్థగా తన ర్యాంకింగ్‌ను నిలుపుకుంది. ఇంజనీరింగ్ విభాగంలో దాని ప్రస్థానం మరింత ఆకట్టుకుంటుంది,