ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    Banswada | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

    వర్ని మండలం హుమ్నాపూర్​, బోధన్​ మండలం(Bodhan Mandal) బెల్లాల్​కు చెందిన పలువురు మహారాష్ట్రలోని పాలజ్​ గణేష్ మందిరానికి(Palaj Ganesh Temple) వెళ్లారు. తిరిగి వస్తుండగా వీరి కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తరోడ్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

    ప్రమాదంలో వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి(Humnapur Village) చెందిన ఇద్దరు, బోధన్ మండలం బెల్లాల్​కు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. చేకూరి బుల్లి రాజు (50), అతని భార్య సునీత ( 45), వాణి (38) మృతి చెందగా గున్నం చంద్రశేఖర్ (35), నీలిమ (45)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్, బైంసా ఆస్పత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో దంపతులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...