ePaper
More
    HomeసినిమాShilpa Shetty | రెస్టారెంట్ పూర్తిగా మూసివేయ‌డం లేదు.. అస‌లు విష‌యం ఇదేనంటున్న శిల్పా శెట్టి

    Shilpa Shetty | రెస్టారెంట్ పూర్తిగా మూసివేయ‌డం లేదు.. అస‌లు విష‌యం ఇదేనంటున్న శిల్పా శెట్టి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Shilpa Shetty | బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి  తీసుకున్న తాజా నిర్ణయం సినీ, ఫుడ్ లవర్స్ అందరినీ షాక్‌కు గురి చేసింది. ముంబైలోని బాంద్రాలో ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసిన ఆమె ప్రఖ్యాత రెస్టారెంట్ ‘బాస్టియన్’ (Bastian)ను మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

    గురువారం రోజు రెస్టారెంట్‌ చివరి కార్యకలాపాలు జరగనున్నాయి. ఆ రోజు రాత్రి తన వ్యాపార భాగస్వాములు, సన్నిహిత మిత్రుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పా తెలిపారు.“ఈ గురువారం మేము బాస్టియన్ బాంద్రాకు వీడ్కోలు చెబుతున్నాం. ఇది మాకు ఎన్నో అపురూప జ్ఞాపకాలను, మరచిపోలేని అనుభవాలను ఇచ్చింది. ఇప్పుడు ఈ శకానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. కానీ త్వరలోనే కొత్త అనుభవాలతో మిమ్మల్ని మరోసారి కలవబోతున్నాం,” అంటూ శిల్పా(Shilpa Shetty) ఎమోషనల్ గా స్పందించారు.

    Shilpa Shetty | తాత్కాలికంగా..

    బాస్టియన్ రెస్టారెంట్‌(Bastian Restaurant) ముంబైలో అత్యంత ప్రముఖమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది. చాలా తక్కువ సమయంలోనే ఇది సెలబ్రిటీలకు, అభిమానులకు ప్ర‌త్యేక‌మైన‌ స్థలంగా మారింది. శిల్పా శెట్టి ఎంతో శ్రద్ధతో ప్రారంభించిన ఈ రెస్టారెంట్‌ను అకస్మాత్తుగా మూసివేయాలనే నిర్ణయం వెనుక ఏమి కారణమో వెల్ల‌డించ‌లేదు. దాంతో ఈ నిర్ణయం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ప‌లువురు ఆమెకి కాల్ చేసి ఎందుకు మూసివేస్తున్నావు అని కాల్స్ మీద కాల్స్ చేస్తున్నార‌ట‌.ఈ క్ర‌మంలో తాను మూసివేయ‌డానికి కార‌ణం ఏంటో తాజాగా తెలియ‌జేసింది శిల్పా శెట్టి.

    నేను బాస్టియ‌న్‌ని పూర్తిగా మూసివేయ‌డం లేదు. ఇది పూర్తిగా మూత‌ప‌డ‌దు. కేవ‌లం ఒక అధ్యాయం ముగించాము అంతే. సౌత్ డిషెస్‌తో మంగుళూరు వంటకాలు మీకు రుచి చూపించేందుకు స‌రికొత్తగా మీ ముందుకు వ‌స్తాము. దీనిని బాస్టియ‌న్ బీచ్ క్ల‌బ్(Bastion Beach Club) పేరుతో జుహూలో ఏర్పాటు చేస్తాము. ఎన్ని బ్రాంచ్‌లు తెర‌చిన కూడా బాంద్రాలోని రెస్టారెంట్ వాటికి మూలం. ఇది ఎప్ప‌టికీ ప్ర‌త్యేకం. మేము దీనిని మూసివేస్తున్నాం అని జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేదు. అక్టోబ‌ర్‌లో తిరిగి జుహూలో ప్రారంభిస్తామంటూ క్లారిటీ ఇచ్చింది. ఇది మూసి వేస్తున్నామ‌ని చెప్పిన ద‌గ్గ‌ర నుండి వేల‌కొద్ది కాల్స్ వ‌స్తున్నాయ‌ని శిల్పా శెట్టి పేర్కొంది.

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...