అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (heavy rains) చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నుంచి మెదక్, హైదరాబాద్ తదితర ప్రధాన పట్టణాలను కలిపే పలు మార్గాల్లో రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Yellareddy | సీఎం పర్యటన నేపథ్యంలో..
ఎల్లారెడ్డి మీదుగా మెదక్, (Yellareddy-Medak) హైదరాబాద్కు (Hyderabad) వెళ్లే మార్గంలో పోచారం గ్రామం (pocharam Village) వద్ద భారీ వరదలతో వంతెనకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదల కారణంగా కేవలం వంతెన మాత్రమే మిగిలిఉంది. ఇరువైపులా రోడ్డు నామరూపాల్లేకుండా పోయింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించింది.
Yellareddy | యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి..
సీఎం రేవంత్రెడ్డి (CM Rtevanth Reddy) గురువారం జిల్లా పర్యటకు వస్తున్న నేపథ్యంలో పోచారం వద్ద వంతెన పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేశారు. వంతెనకు ఇరువైపులా గతంలో రోడ్లు కొట్టుకుపోగా.. ప్రస్తుతం మొరంతో రెండువైపులా రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ మార్గం గుండా భారీ వాహనాలు సైతం వెళ్తున్నాయి.
గతంలో భారీవర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు ఇదే..