ePaper
More
    HomeసినిమాAnchor Udayabhanu | సుమ‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన ఉద‌య భాను.. నదిని బంధించలేరు.. సూర్యుడ్ని...

    Anchor Udayabhanu | సుమ‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన ఉద‌య భాను.. నదిని బంధించలేరు.. సూర్యుడ్ని ఆపలేరంటూ కామెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Anchor Udayabhanu | ప్రముఖ టీవీ యాంకర్, నటి ఉదయభాను మరోసారి వార్తల్లోకెక్కారు. ఇటీవల ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హోస్ట్ చేసిన సందర్భంగా చేసిన ‘యాంకర్ సిండికేట్’(Anchor Syndicate) వ్యాఖ్యలు చేసిన‌ సంగతి తెలిసిందే.

    ఈ వ్యాఖ్యలు సీనియర్ యాంకర్ సుమ(Senior Anchor Suma)ను టార్గెట్ చేశాయనే ఆరోపణలు రావడంతో, సుమ భర్త రాజీవ్ కనకాల(Rajiv Kanakala) కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అసందర్భంగా.. ‘మళ్లీ సిండికేట్’ అంటారంటూ సినిమా ఈవెంట్‌లో ఉదయభానుకి కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయభాను ఈ వివాదంపై మరోసారి స్పందించారు.

    Anchor Udayabhanu | ఆగేదే లేదు..

    “నేను ఎవర్నీ టార్గెట్ చేసి ఆ మాటలు చెప్పలేదు. నా జీవితంలో నన్ను ఎలా తప్పించారో నేను ఎదుర్కొన్న వాస్తవం మాత్రమే పంచుకున్నాను,” అంటూ స్పష్టం చేశారు.12 ఏళ్ల వయసులోనే మైక్ పట్టుకున్నా.. గవర్నమెంట్ స్కూల్ చదివిన పల్లెటూరి అమ్మాయిని. దాదాపు మూడు దశాబ్దాలు ఈ రంగంలో ఉన్నా. ఇప్పటికీ నన్ను స్కూల్ గాళ్‌లా జడ్జ్ చేస్తే ఎలా?” అంటూ ఎమోషనల్‌గా చెప్పారు. అవకాశాలు వచ్చాక వాపసు తీసుకోవడం, లాస్ట్ నిమిషంలో త‌ప్పించ‌డం, కాస్ట్యూమ్ రెడీ చేసుకుని వెళ్తే తనను తీసుకోకపోవడం, ఇలా తనకు ఎదురైన అనుభవాల్ని ఉదయభాను(Anchor Udayabhanu) వివరించారు.అలా జరిగిన ప్రతిసారీ బాధపడ్డాను. అయినా నా పని ఆగలేదు. నన్ను నేను ఎన్నిసార్లు నిరూపించుకోవాలి? కానీ ఇప్పటికీ ఆడియన్స్ నాపై ప్రేమ చూపిస్తున్నారు. అదే నాకు చాలు అని ఉద‌య‌భాను అన్నారు.

    ఇప్పుడు నా ఆలోచనలు మారాయి. ఎవరో అవకాశం ఇస్తారని కూర్చోవడం కాదు. నేనే అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాను. నా ధైర్యమే నా ఆయుధం. నా జీవితం నన్ను శిక్షించింది.. నేర్పింది. సూర్యుడికి మధ్యలో గ్రహణం పట్టినా అతను మళ్లీ వెలుగుతాడు. నేను కూడా అలాగే ఉదయిస్తాను,” అంటూ ఆత్మవిశ్వాసంతో వ్యాఖ్యానించారు. ఉదయభాను తన వ్యాఖ్యల్లో ప్రస్తుత యాంకర్లను అభినందిస్తూ, “ఈరోజు ఇండస్ట్రీలో చాలా బ్యూటీఫుల్ యాంకర్లు ఉన్నారు. వాళ్లంతా బాగా చేస్తున్నారు. నేను కూడా ఇక్కడే ఉన్నాను. నాకు కూడా ఒక స్థానం ఉంది,” అంటూ చెప్పుకొచ్చారు. అవకాశాలు రాక‌పోయిన‌, విమర్శలు ఎదురైనా వెనుకాడని ఆమె ధైర్యం సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...