అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఐదుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించారు. బుధవారం తన కార్యాలయంలో సన్మానం చేశారు.
మాక్లూర్, నవీపేట్, మెండోరా, మోపాల్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, కోటగిరి పోలీస్ స్టేషన్లలో మొత్తం 15 హత్య కేసులలో 11 కేసులలో నేరస్తులకు యావజ్జీవ కారగార శిక్ష పడేటట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేశారు. నాలుగు కేసుల్లో పదేళ్ల జైలుశిక్ష పడేటట్లు కేసులను వాదించారు.
పలు పోలీస్ స్టేషన్లలో గల హత్య కేసులలో నేరస్తులకు జీవిత కారాగార శిక్ష పడేటట్లు కృషి చేసిన డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నర్సయ్య, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యాంరావును పోలీస్ కమిషనర్ సన్మానించారు.