- Advertisement -
HomeUncategorizedNEET Exam | నీట్​ పరీక్షపై అసత్య ప్రచారం.. కఠిన చర్యలకు సిద్ధం

NEET Exam | నీట్​ పరీక్షపై అసత్య ప్రచారం.. కఠిన చర్యలకు సిద్ధం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం Neet entrance exam కోసం నిర్వహించే నీట్​ పరీక్షపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఎన్‌టీఏ NTA చర్యలు చేపట్టింది. నీట్​పై తప్పుడు ప్రచారం చేస్తున్న 120కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించింది.

సంబంధిత సోషల్ అకౌంట్లపై కేసులు నమోదు చేయాలని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బదిలీ చేసింది. అలాగే ఈ అకౌంట్లను తొలగించాలని టెలిగ్రామ్‌ telegram, ఇన్‌స్టాగ్రామ్‌ instagram సంస్థలను సైతం వివరణ కోరినట్లు సమాచారం. నీట్​ పరీక్షపై తప్పుడు ప్రచారం చేస్తున్న, భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై ఫిర్యాదు చేయడానికి ఎన్​టీఏ ఇటీవల పోర్టల్ nta portal ​ ప్రారంభించింది. దీంతో భారీగా ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువ శాతం టెలిగ్రామ్‌ ఛానల్‌ లింక్‌లే ఉన్నట్లు సమాచారం. కాగా.. ఆయా ఛానెళ్లపై చర్యలకు అధికారులు సిద్ధం అయ్యారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News