అక్షరటుడే, ఇందూరు: Video Journalist Association | నగరంలోని (Nizamabad City) వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్‌ను ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో (R&B Guesthouse) సమావేశం నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు రవిచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జనల్బాడీ మీటింగ్ నిర్వహించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీకి అధ్యక్షుడిగా పెరుమాండ్ల నగేష్ గౌడ్(99టీవీ), ఉపాధ్యక్షుడిగా మామిడాల అరవింద్ (టీవీ9), ప్రధాన కార్యదర్శిగా పులి అనిల్ (ఏబీఎన్), కోశాధికారిగా శ్రీకాంత్ (ఐ న్యూస్), ఆర్గనైజర్ సెక్రెటరీగా అభిలాష్ (కే6), సంయుక్త కార్యదర్శిగా బొడ్డుల సాయి కిరణ్ (సాక్షి టీవీ) మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.