ePaper
More
    HomeతెలంగాణKavitha Issue | ఎమ్మెల్సీ క‌విత‌కు కేఏ పాల్ బంఫ‌ర్ ఆఫ‌ర్‌

    Kavitha Issue | ఎమ్మెల్సీ క‌విత‌కు కేఏ పాల్ బంఫ‌ర్ ఆఫ‌ర్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Kavitha Issue | బీఆర్ఎస్ బ‌హిష్కృత ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. బీసీల కోసం పోరాడాలంటే ప్ర‌జాశాంతి పార్టీలో చేరాల‌ని ఆమెను ఆహ్వానించారు.

    ఎమ్మెల్సీ క‌విత‌ను మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి సస్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. కాళేశ్వ‌రం విష‌యంలో ఆమె హ‌రీశ్‌రావు, సంతోష్‌రావుపై చేసిన వ్యాఖ్య‌ల‌తో పార్టీ నుంచి వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో బుధ‌వారం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ క‌విత (MLC Kavitha) పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మ‌రోసారి ఇరువురు నేత‌ల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారు. అలాగే తన సోద‌రుడు, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (KTR) ఉద్దేశించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. కాగా.. క‌విత ఎపిసోడ్ అంశం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది.

    ఇదిలా ఉండ‌గా.. క‌విత రాజీనామాపై (Kavita Resignation) ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ స్పందించారు. క‌విత బీజేపీ వ‌దిలిన బాణం కాద‌ని, త‌న‌ను తాను నిరూపించుకోవాలంటే ప్ర‌జాశాంతి పార్టీలో చేరాల‌ని సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం ఓ వీడియో విడుద‌ల చేశారు. క‌విత బీసీల కోసం పోరాడుతాను అంటోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. బీజేపీ బ్రాహ్మ‌ణుల పార్టీ అని, కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. క‌విత బీసీల కోసం పోరాడ‌లంటే.. బీసీల పార్టీ అయిన ప్ర‌జాశాంతి పార్టీలో (Praja Shanti Party) చేరాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు క‌విత మీద న‌మ్మ‌కం క‌ల‌గాలంటే, గ‌ద్ద‌ర్ చేరిన ప్ర‌జాశాంతి పార్టీలో చేరాల‌న్నారు. ప్ర‌జాశాంతి పార్టీలోకి రావాల‌ని, జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల్లో పోరాడుదామ‌ని సూచించారు.

    Kavitha Issue | సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

    క‌విత విష‌యంలో కేఏ పాల్ (KA Paul) వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆయ‌న వీడియోపై నెటిజ‌న్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంద‌రు ఆయ‌న‌ను విమ‌ర్శిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు క‌విత‌కు కేఏ పాల్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. కేఏ పాల్ గ‌తంలో సైతం ప‌లువురిని ఇలాగే పార్టీలోకి ఆహ్వానించారు.

    More like this

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం...

    September 4 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 4 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 4,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం...