అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tallest Ganesh | దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మామూలుగా లేదు. ప్రతి ఊరు, ప్రతి వీధి వినాయకుని విభిన్న రూపాలతో, రంగు రంగుల మకరందాలతో ఆకట్టుకుంటున్నాయి. అయితే గణేశుడు కేవలం భారత్‌కి మాత్రమే పరిమితం కాదు అన్న విషయం మరొకసారి స్పష్టమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో గణేశుడిని ఆరాధిస్తున్నారంటే ఆ భక్తి పరిమితి ఎంత ఉందో అర్థం అవుతుంది. థాయిలాండ్‌లోని చాచోంగ్‌సావో ప్రావిన్స్(Chachoengsao Province) ప్రాంతంలో ఉన్న ఖ్లాంగ్ ఖుయాన్ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహం(Vinayaka Statue) ఉంది.
Tallest Ganesh | ఎత్తైన విగ్రహం..
ఇది 39 మీటర్లు (సుమారు 128 అడుగులు) ఎత్తులో ఉంది. కంచుతో (బ్రాంజ్) నిర్మించిన ఈ విగ్రహం హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఈ విగ్రహం నిర్మాణానికి దాదాపు నాలుగేళ్లు పట్టగా, 2012లో నిర్మాణం పూర్తైంది. ఈ విగ్రహం నిర్మాణానికి 854 బ్రాంజ్ పీసులు వాడగా, మొత్తం బరువు 1,000 టన్నులకు పైగా ఉంటుంది. ఈ విగ్రహం థాయిలాండ్(Thailand)కి వస్తున్న వేలాది పర్యాటకులకు భక్తి, కళా సంపద కలగలిపిన దర్శనంగా నిలుస్తుంది.
గణేశుడి చేతుల్లో ఉంచిన పూలు, ఫలాలు, పదార్థాలు ప్రతి ఒక్కటీ ప్రత్యేక అర్థం కలిగి ఉన్నాయి. అరటిపండు.. జీవనోపాధిని సూచిస్తుంది, చెరకు..ఆనందాన్ని సూచిస్తుంది. పనసపండు..శ్రేయస్సుకు సంకేతం, మామిడి.. జ్ఞానానికి రూపంగా నిలుస్తుంది. ఇవి మొత్తం కలిపి జీవితం ఎలా సంపూర్ణంగా ఉండాలో సందేశమిస్తాయి. ఈ విగ్రహం 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విరాజిల్లుతోంది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పరిషత్‌లకు వేదికగా నిలుస్తోంది. గణేశుడి ఆశీస్సులతో దేశానికి రక్షణ, ప్రజలకు శుభం కలుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఖ్లాంగ్ ఖుయాన్ గణేష్ పార్క్(Khlong Khuyan Ganesh Park)కి ఎలా చేరుకోవాలి అంటే భారతదేశం నుండి బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి నేరుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. విమాన ప్రయాణం సుమారు 4–5 గంటలు పడుతుంది.
రోడ్డుమార్గం ద్వారా అయితే బ్యాంకాక్ నుండి ఖ్లాంగ్ ఖుయాన్ వరకు 80 కిలోమీటర్లు . టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం ద్వారా సుమారు 1.5–2 గంటలలో చేరవచ్చు. రైలు మార్గం ద్వారా అయితే హువా లాంఫాంగ్ రైల్వే స్టేషన్ నుండి చాచోంగ్‌సావో జంక్షన్ వరకు రైళ్లు నడుస్తాయి. అక్కడ నుండి టక్‌టుక్స్, టాక్సీలు తీసుకుని విగ్రహం వద్దకు చేరవచ్చు.
Standing at around 128 feet (approximately 39 meters) tall (including its base), the bronze standing Ganesha Murti at Khlong Khuean Ganesh International Park in Chachoengsao, Thailand is recognized as the world’s tallest standing Ganesha statue.
।। Jai Shree Ganesh ।। 🙏🚩 pic.twitter.com/3FrBEXhWOz
— अक्षता सिंह (@i_akshataa) July 23, 2025