అక్షరటుడే, ఇందూరు : ACB Raids | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం కార్యాలయాలకు వచ్చే వారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు.
నిజామాబాద్ నగరపాలక సంస్థలో (Nizamabad Municipal Corporation) బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ సెక్షన్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆర్ఐ శ్రీనివాస్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.