ePaper
More
    Homeక్రీడలుAsia Cup 2025 | స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌కి రెడీ అయిన టీమిండియా.. తొలిసారి...

    Asia Cup 2025 | స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌కి రెడీ అయిన టీమిండియా.. తొలిసారి బ్లాంక్ జెర్సీతో బరిలోకి!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup 2025 | ఈసారి ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో టీమిండియా కొత్త అవతారంలో కనిపించనుంది. స్పాన్సర్ లేకుండా బ్లాంక్ జెర్సీ(Blank Jersey)లో బరిలోకి దిగుతుంది.

    ఇప్పటివరకు జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11 సంస్థ(Dream 11 Company), కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు నేపథ్యంలో, బీసీసీఐతో ఉన్న ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకుంది. మొదట 2026 వరకు ఈ ఒప్పందం కొనసాగాల్సి ఉండగా, తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే ర‌ద్ధైంది. ప్రస్తుతం బీసీసీఐ కొత్త స్పాన్సర్(BCCI New Sponsor) కోసం బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 16 లోగా తమ బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

    Asia Cup 2025 | బ్లాంక్ జెర్సీతో..

    గతంలో డ్రీమ్11 రూ.358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోగా, ఇప్పుడు బీసీసీఐ ఈ రేటును పెంచి రూ.452 కోట్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ, విదేశీ సిరీస్‌లకు స్పాన్సర్‌షిప్ రేటు: రూ. 3.5 కోట్లు (ప్రతి మ్యాచ్‌కు), ఐసీసీ/ఏసీసీ టోర్నమెంట్‌లలో స్పాన్సర్‌షిప్ రేటు: రూ. 1.5 కోట్లు (ప్రతి మ్యాచ్‌కు) వ‌సూలు చేయ‌నున్నారు. అయితే స్పాన్సర్‌షిప్ ఒప్పందం కేవలం దేశీయ, విదేశీ మ్యాచ్‌లకు మాత్రమే కాకుండా ఏసీసీ, ఐసీసీ నిర్వహించే అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు కూడా వర్తిస్తుందని తెలుస్తుంది.

    ప్ర‌స్తుతం స్పాన్సర్(Sponsor) లేకపోవడంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా అంద‌రి ఆటగాళ్ల జెర్సీలపై “ఇండియా” లోగోను పెద్దదిగా ముద్రించనున్నారు. ఇది జట్టుకు కొత్త లుక్ ఇవ్వనుంది. ఆసియా కప్‌ జట్టు చూస్తే.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇతర సభ్యులు: అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్. ఈ టోర్నీ కోసం భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. టోర్నమెంట్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది.

    More like this

    September 5 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 5 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 5,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Best Teacher Award | ఉమ్మడిజిల్లాలో ఉత్తమ గురువులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది....

    Migraine | మైగ్రేన్ సమస్యలతకు చింతపండుతో చెక్.. ఎలాగంటారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు...