ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | పాత కలెక్టరేట్​ మైదానంలో గంజాయి స్వాధీనం..

    Nizamabad City | పాత కలెక్టరేట్​ మైదానంలో గంజాయి స్వాధీనం..

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలో గంజాయి (Marijuana) విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. యువతను టార్గెట్​ చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు.

    గంజాయి సరఫరాను నిలువరించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదోఒక విధంగా నగరంలో మత్తుపదార్థాల విక్రయాలు కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్ర (Maharashtra) నుంచి దిగుమతి చేసుకొని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకుని వయసుతో సంబంధం లేకుండా యువతకు గంజాయిని అలవాటు చేస్తున్నారు.

    Nizamabad City | నగరంలో యథేచ్ఛగా..

    నగరంలోని పాత కలెక్టరేట్​ మైదానంలో (Old Collectorate Ground) మంగళవారం రాత్రి ఓ వ్యక్తి మైదానంలోకి గంజాయిని విక్రయించేందుకు వచ్చాడు. సమాచారం అందుకున్న ఒకటో టౌన్​ పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు.

    పోలీసులు వస్తున్నారనే సమాచారంతో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అక్కడ నిలిపి ఉంచిన బైకులోని సుమారు 20 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బైక్​ను సీజ్​ చేశారు. ఈ సందర్భంగా గంజాయి సరఫరా చేస్తున్న వారిపై సీపీ కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    More like this

    Vice President Election | ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు స‌ర్వం సిద్ధం ఎన్డీయే గెలుపు లాంఛ‌న‌మే.. కానీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో...

    Urban Company IPO | ఐపీవోకు అర్బన్‌ కంపెనీ.. బుధవారంనుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urban Company IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. మొబైల్‌...

    E-Commerce | పండుగ స్పెషల్‌.. ఇ-కామర్స్‌లో ఉద్యోగాల జాతర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : E-Commerce | దసరా పండుగ సమీపిస్తోంది. షాపింగ్‌ సందడి పెరగనుంది. పండుగ సీజన్‌ను సొమ్ము...