ePaper
More
    Homeక్రీడలుRohith Sharma | వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో వేరే జ‌ట్టుకి ఆడ‌నున్న రోహిత్ శ‌ర్మ‌.. కార‌ణం...

    Rohith Sharma | వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో వేరే జ‌ట్టుకి ఆడ‌నున్న రోహిత్ శ‌ర్మ‌.. కార‌ణం ఏంటంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025(IPL 2025) ముగిసిన వెంటనే, అన్ని ఫ్రాంచైజీలు తమ తదుపరి సీజన్‌పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ స్టార్ ఆటగాడు, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohith Sharma) గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    అతను IPL 2026లో కొత్త జట్టుకు మారతాడని , ముంబైని విడిపోయే అవకాశముందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, రోహిత్ శర్మను వేరే జట్టుకు ట్రేడ్ చేసే ఆలోచన లేదని ముంబై ఇండియన్స్ స్పష్టం చెసీనట్టు నివేదికలు చెబుతున్నాయి.

    Rohith Sharma | ఊహాగానాలు..

    రాజస్థాన్ రాయల్స్ (RR),కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH),ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఈ నాలుగు ఫ్రాంచైజీలు రోహిత్ శర్మను తమ జట్టుకు ట్రేడింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉండగా, ముంబై ఇండియన్స్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి చర్చలకూ సిద్ధంగా లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. MI REJECT TRADE TALKS ABOUT ROHIT SHARMA ” అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా వైరల్ అయింది. IPL 2025 సీజన్ ముంబై ఇండియన్స్‌కు సవాలుతో కూడుకున్నదే. రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి.తక్కువ పరుగులు, ఫీల్డింగ్ సమయంలో తడబాట్లు, ప్లేయింగ్ XI నుంచి తొలగింపు, ఇంపాక్ట్ ప్లేయర్‌గా అవకాశం ఈ పరిణామాల నేపథ్యంలో, రోహిత్ శర్మ ముంబైని వీడి ఇతర జట్టులోకి వెళ్లవచ్చని ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి . అయితే తాజా సమాచారం వాటికి పూర్తిగా ఎండ్‌కార్డు వేసిన‌ట్టే అని అనిపిస్తుంది.

    రోహిత్ శర్మ 2011 నుంచి ముంబై ఇండియన్స్‌లో సభ్యుడు. 5 IPL టైటిళ్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియ‌న్స్ సాధించింది. 272 మ్యాచ్‌లు , 7046 పరుగులు , 2 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు..ఇది ఐపీఎల్ రోహిత్ శ‌ర్మ ట్రాక్ రికార్డ్. ముంబై ఇండియన్స్ IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచేలా చేసిన కెప్టెన్‌ రోహిత్ శర్మనే అని స్పష్టంగా చెప్పాలి. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నా, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)లోనే కొనసాగుతారని తాజా నివేదికలు చెబుతున్నాయి.

    More like this

    September 5 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 5 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 5,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Best Teacher Award | ఉమ్మడిజిల్లాలో ఉత్తమ గురువులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది....

    Migraine | మైగ్రేన్ సమస్యలతకు చింతపండుతో చెక్.. ఎలాగంటారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు...