ePaper
More
    HomeజాతీయంGold Price | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. వెండి ప‌రిస్థితి ఏంటి..?

    Gold Price | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. వెండి ప‌రిస్థితి ఏంటి..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Price | దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు బంగారం వైపు క‌న్నెత్తి కూడా చూసే ప‌రిస్థితి లేదు. భౌగోళిక రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణత ఇవన్నీ కలిసి బంగారం ధరలను ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేర్చాయి.

    పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గు చూపుతుండడంతో, బంగారానికి డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ రోజు (సెప్టెంబర్ 3, 2025) బంగారం ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. 24 క్యారెట్లు (10 గ్రాములు) రూ.1,06,100గా ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు (10 గ్రాములు) బంగారం ధ‌ర (Gold Rate) రూ.97,260గా న‌మోదైంది. వెండి ధరలు (Silver Prices) కూడా నిన్నటితో పోలిస్తే సుమారు రూ.100 పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

    Gold Price | కొనే ప‌రిస్థితి లేదు..

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. హైదరాబాద్‌లో రూ.1,06,100, రూ.97,260గా న‌మోదైంది. విజయవాడలో Vijayawada రూ.1,06,100, రూ.97,260, ఢిల్లీలో రూ.1,06,410, రూ.97,410, ముంబైలో రూ.1,06,100, రూ.97 260, వడోదరలో రూ.1,06,150, రూ.97,310, కోల్‌కతాలో రూ.1,06,100, రూ.97,260, చెన్నైలో రూ.1,06,100, రూ.97,260, బెంగళూరులో రూ.1,06,100, రూ.97,260, కేరళలో రూ.1,06,100, రూ.97,260, పుణెలో రూ.1,06,100, రూ.97,260గా ట్రేడ్ అయింది.

    ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) Silver Prices చూస్తే.. హైదరాబాద్‌లో రూ.1,36,200, విజయవాడలో రూ.1,36,200, ఢిల్లీలో రూ.1,26,200, చెన్నైలో రూ.1,36,200, కోల్‌కతాలో రూ.1,26,200, కేరళలో రూ.1,36,200, ముంబైలో రూ.1,26,200, బెంగళూరులో రూ.1,26,200, వడోదరలో రూ.1,26,200, అహ్మదాబాద్‌లో రూ.1,26,200గా ట్రేడ్ అయింది. ధరల పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటనేది చూస్తే.. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల విశ్వాసం బంగారంపై పెరగడం, రూపాయి విలువ తగ్గడం, ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టాలా? లేదా వేచి చూడాలా? అనే దానిపై వినియోగదారులు జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. ధరలు గరిష్టానికి చేరడంతో, మార్కెట్ ట్రెండ్‌లను ఆధారంగా ముందుకు సాగాలి.

    More like this

    Aisa Cup | మ‌రో నాలుగు రోజుల‌లో ఆసియా కప్ 2025.. ట్రోఫీ గెలిచిన జ‌ట్టుకి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aisa Cup | ఆసియా కప్ 2025కి (Asia Cup 2025) రంగం సిద్ధమైంది....

    Flipkart Big Billion Days | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Flipkart Big Billion Days | ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఫ్లిప్‌కార్ట్...

    Stock Market | గ్యాప్‌ అప్‌లో ప్రారంభమైనా.. నష్టాల్లోకి జారుకున్న సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets) వరుసగా రెండో రోజూ...