ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Draft voters list | ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

    Draft voters list | ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Draft voters list | హైకోర్టు (High Court) ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి.

    మండల్ ప్రజా పరిషత్ (MPP), జిల్లా ప్రజా పరిషత్ (ZPP)ల కోసం తాత్కాలిక ఓటర్ల జాబితాలను రూపొందించి, ప్రదర్శించేందుకు తాజాగా (ఆగస్టు 30) రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Election Commission) షెడ్యూల్‌ను ప్రకటించింది.

    Draft voters list : ఈ తేదీల మధ్య..

    సెప్టెంబరు (2025) 6 నుంచి 10 వరకు వివిధ దశల్లో ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ కొనసాగనుంది.

    రాజ్యాంగం (Constitution) లోని 243-K ఆర్టికల్, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగనుంది.

    Draft voters list : ఇక పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే..

    ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఆధారంగా నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు.

    31మండలాల్లోని 545 గ్రామ పంచాయతీల్లో ఉన్న 5,022 వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు.

    జులై 1న గ్రామ పంచాయతీ, వార్డలు వారీగా ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్​ల జాబితాను రూపొందించిన విషయం తెలిసిందే. వాటిని ఆగస్టు 28న అన్ని గ్రామ పంచాయతీలలో ప్రదర్శించారు.

    వాటిలోని అభ్యంతరాలను ఆగస్టు 30 వరకు స్వీకరించి, 31న పరిష్కరించారు. ఈ మేరకు తుది ముసాయిదా ఓటర్ల జాబితాలను అన్ని మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఉంచారు.

    ఇక ఈ పంచాయతీ ముసాయిదా జాబితా ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నియోజక వర్గాల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగనుంది.

    More like this

    ACB Raids | మున్సిపల్​ కార్పొరేషన్​లో ఏసీబీ సోదాల కలకలం..

    అక్షరటుడే, ఇందూరు : ACB Raids | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం కార్యాలయాలకు వచ్చే...

    MLC Kavitha | ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా.. బీఆర్​ఎస్​ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MLC Kavitha | బీఆర్​ఎస్​ పార్టీని హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే తనను సస్పెండ్...

    Ration Shops | రేషన్​డీలర్లకు సిగ్నల్ రాక ఇబ్బందులు.. బస్టాండ్​లో రేషన్​ అందజేత

    అక్షరటుడే, లింగంపేట: Ration Shops | జిల్లాలో రేషన్​ బియ్యం (ration rice) పంపిణీకి సిగ్నల్​ అంతరాయం సృష్టిస్తున్నాయి....