ePaper
More
    Homeక్రీడలుVijender Singh | క్రికెటర్లపై భారత మాజీ బాక్సర్ సంచలన వ్యాఖ్యలు!

    Vijender Singh | క్రికెటర్లపై భారత మాజీ బాక్సర్ సంచలన వ్యాఖ్యలు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijender Singh | క్రికెటర్లు మోసకారులని, వయసు తగ్గించుకొని ఆడుతారని భారత మాజీ బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్(Vijender Singh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan royals) చిచ్చర పిడుగు, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వయసుపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజేందర్ సింగ్(Vijender Singh) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

    14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయడమే కాకుండా 35 బంతుల్లో శతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. టీ20ల్లోనే సెంచరీ సాధించిన అత్యంత పిన్నవయస్కుడి వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) నిలిచాడు. ‘పిల్లాడే పిడుగల్లే’ అన్నట్లు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్లపై సూర్యవంశీ విరుచుకుపడ్డాడు. 11 సిక్సర్లతో ఊచకోత కోశాడు.

    అయితే సూర్యవంశీ టెంపర్‌మెంట్.. షాట్స్ ఆడుతున్న తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. టీమిండియా ఫ్యూచర్ అంటూ దిగ్గజ ఆటగాళ్లు కితాబిచ్చారు. మరికొందరు మాత్రం వైభవ్ సూర్యవంశీకి 14 ఏళ్లు అంటే నమ్మశక్యంగా లేదని, అతనికి కచ్చితంగా 16-17 ఏళ్లు ఉంటాయని, ఏజ్ ఫ్రాడ్ చేశాడని ఆరోపిస్తున్నారు. క్రికెటర్లు తమ వయసును ఒకటి, రెండు సంవత్సరాలు తక్కువగా రాయించుకుంటారని, నార్త్ ఇండియాలో ఇది ఎక్కువని అభిప్రాయపడుతున్నారు.

    ఈ క్రమంలోనే బాక్సర్ విజేందర్ సింగ్..‘క్రికెట్‌లో కూడా ఆటగాళ్లు తమ వయసును తగ్గించుకోవడం మొదలు పెట్టారు’ అని హిందీలో ట్వీట్ చేశాడు. వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించే విజేందర్ సింగ్ ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ.. ఈ ఆరోపణలను ఖండించాడు. ఎలాంటి టెస్ట్‌కు అయినా తమ కొడుకు సిద్దమని సవాల్ విసిరాడు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...