అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి (in-charge Dr.Eleti Mallikarjun Reddy) మంగళవారం మండలంలోని పురాణిపేట్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
గ్రామానికి చెందిన ఎం.గోపాల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందగా.. ఈ మేరకు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. అలాగే పల్లికొండ గ్రామ (Pallikonda village) కార్యకర్త ముద్దుల ప్రశాంత్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు ఆరే రవీందర్, పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, కార్యదర్శి నర్సారెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్,సీనియర్ నాయకులు మహిపాల్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్, సీనియర్ నాయకులు సంధ్యారాజు, తక్కురి అంజయ్య, శెట్టి లక్ష్మణ్, హరి ప్రసాద్, సురేందర్, గంగాధర్ గౌడ్, హకీమ్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.