అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | గోపాలపల్లికి చెందిన బెన్ని ఆధ్వర్యంలో గ్రామస్థులు పలువురికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. తన కూతురు అద్విక పుట్టినరోజు సందర్భంగా తనవంతు సామాజిక బాధ్యతగా 60 హెల్మెట్లను (helmets) పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali), సీఐ ప్రసాద్ గ్రామపెద్దల చేతులమీదుగా హెల్మెట్లను అందజేశారు. అనతరం సీఐ మాట్లాడుతూ.. వాహనదారులకు హెల్మెట్ ఉచితంగా అందించడంపై అభినందించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.