అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | భక్తులు శాంతియుత వాతావరణంలో వినాయకుడి ఉత్సవాలు జరుపుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) అన్నారు.
నిజామాబాద్ నగరంలో మంగళవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి గణేశ్ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
Nizamabad City | సమన్వయంతో పనిచేయాలి
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలి సభ్యులు భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో శోభాయాత్రలో పాల్గొనాలని పేర్కొన్నారు. అనంతరం వినాయక్ నగర్‌లోని (Vinayak Nagar) వినాయకుల బావి వద్ద ఏర్పాట్లను సమీక్షించారు.
Nizamabad City | యంచ వద్ద నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన..
జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని కలెక్టర్, సీపీ సంయుక్తంగా పరిశీలించారు. చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉమ్మెడ మార్గాన్ని, బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు.
Nizamabad City | గజ ఈతగాళ్లు.. క్రేన్లు..
యంచ గోదావరి బ్రిడ్జితో పాటు, ఉమ్మెడ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం కోసం సరిపడా క్రేన్లను, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్, సీపీ సిబ్బందికి సూచించారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్స్, మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిమజ్జనోత్సవంలో ఏ చిన్న అపశ్రుతి జరగకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిఘ్యాన్ మాల్వియా, భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ (Nizamabad Municipal corporation) కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ రావు, మున్సిపల్, ఆర్అండ్బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులున్నారు.