అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్(Wallstreet futures) భారీ నష్టాల్లోకి జారుకోవడం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. దీంతో మధ్యాహ్నం వరకు లాభాలతో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Market) సైతం ఒక్కసారిగా పతనమయ్యాయి. చివరికి నష్టాలతో ముగిశాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 397 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో అక్కడినుంచి 753 పాయింట్లు పడిపోయింది. 28 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 131 పాయింట్లు లాభపడిరది. అక్కడినుంచి 234 పాయింట్లు పతనమైంది. చివరికి సెన్సెక్స్(Sensex) 206 పాయింట్ల నష్టంతో 80,157 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 24,579 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,531 కంపెనీలు లాభపడగా 1,614 స్టాక్స్ నష్టపోయాయి. 140 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 124 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 64 కంపెనీలు 52 వారాల కనిష్టాల(52 weeks low) వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 0.70 లక్షల కోట్లమేర పెరిగింది.
మధ్యాహ్నం తర్వాత బేర్స్ చేతుల్లోకి..
డాలర్(Dollar) ఐదువారాల కనిష్టానికి చేరుకోవడం, మరోవైపు బంగారం ధర కొత్త రికార్డులు నెలకొల్పుతూ పరుగులు తీస్తుండడంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో నెలకొంది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు సైతం లాభాల స్వీకరణ(Profit booking)కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం 1గంట వరకు బుల్స్ చేతుల్లో ఉన్న మార్కెట్.. ఒక్కసారిగా బేర్ పంజాకు గురైంది. బీఎస్‌ఈ(BSE)లో పవర్ 1.62 శాతం, యుటిలిటీ 1.47 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.12 శాతం, ఇన్‌ఫ్రా 1.03 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.95 శాతం, మెటల్ 0.90 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.80 శాతం, ఎనర్జీ 0.65 శాతం పెరిగాయి. బ్యాంకెక్స్ 0.68 శాతం నష్టపోగా.. టెలికాం 0.59 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.54 శాతం, ఆటో ఇండెక్స్ 0.23 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.64 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం పెరగ్గా.. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.09 శాతం నష్టపోయింది.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో, 15 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. పవర్‌గ్రిడ్ 2.04 శాతం, ఎన్టీపీసీ 1.60 శాతం, టాటా స్టీల్ 1.44 శాతం, హెచ్‌యూఎల్ 1.09 శాతం, రిలయన్స్ 0.97 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎంఅండ్‌ఎం 2.45 శాతం, ఆసియా పెయింట్ 1.33 శాతం, కొటక్ బ్యాంక్ 1.28 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.15 శాతం, టాటా మోటార్స్ 0.83 శాతం నష్టపోయాయి.