అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collectorate | కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కొలువైన గణనాథునికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో, ఉద్యోగులు, సాధారణ ప్రజలు భారీగా తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్, టీజీవో నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం
ఈనెల 6న పట్టణంలో గణేష్ నిమజ్జనం (Ganesh Nimajjanam) ఉన్నందున అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణంలో నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గంలో వీధిదీపాలు, పారిశుధ్య పనులు పూర్తిచేస్తున్నారు. విద్యుత్, వైద్య, మున్సిపల్ శాఖాధికారులు సమన్వయంతో పనులను నిర్వహిస్తున్నారు.