అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anushka Shetty | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’(Action thriller Ghati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం(Director Krish Jagarlamudi)లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కథలో ఘాటి అనే పదానికి ప్రత్యేకమైన అర్ధం ఉంది. రెండు కొండల మధ్య ఉన్న ఎత్తైన మార్గం. గంజాయి అక్రమ సాగు, రవాణా నేపథ్యంలో పోలీసులు, స్మగ్లర్ల మధ్య ఛేజ్, డ్రామా, యాక్షన్ మిళితంగా కథ నడుస్తుంది. స్మగర్ల ముఠా నుంచి తనను నమ్ముకున్న వారి కోసం ఓ సాధారణ మహిళ ఎలా ప్రాణాలకు తెగించి పోరాడుతుందో అనేది మూవీ స్టోరీ అని తెలుస్తోంది.
Anushka Shetty | క్రాస్ ఓవర్ ఐడియా అదుర్స్..
చిత్రంలో అనుష్క(Anushka Shetty) గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటి శీలవతిగా కనిపించనుంది. అయితే తాను చేసే పని తప్పని తెలుసుకొని ఆ తర్వాత గంజాయి ముఠాపై అనుష్క పోరాటం చేస్తుందట. ఇందులో అనుష్క పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. మరోవైపు పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ (Allu Arjun) ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారిద్దరు కలిసి స్మగ్లింగ్‌కి తిరుగుబాటుగా సినిమా చేస్తే ఎలా ఉంటుందనే చర్చ జోరుగా నడుస్తుంది. ఇదే విషయాన్ని అనుష్క దగ్గర ప్రస్తావిస్తే ఈ ఐడియా ఏదో బాగుంది. ఈ క్రాస్ ఓవర్ గురించి సుకుమార్ గారికి చెప్పండి. ఇదే జరిగితే ఆడియన్స్‌కి థ్రిల్ ఖాయం అని అనుష్క పేర్కొంది.
ఘాటి సినిమాలో అనుష్కతో పాటు చైతన్యరావు, విక్రమ్ ప్రభు, రవీంద్ర విజయ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. UV క్రియేషన్స్ సమర్పణలో, ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఈ సినిమా పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. గంజాయి స్మగ్లింగ్ వెనక చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఎంతో మంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఘాటి చిత్రం తీసానని క్రిష్ పేర్కొన్నారు.