ePaper
More
    HomeజాతీయంOnam Festival | ఓనం వేడుకల్లో విషాదం.. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఉద్యోగి మృతి

    Onam Festival | ఓనం వేడుకల్లో విషాదం.. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఉద్యోగి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Onam Festival | కేరళలో ఓనం పండుగ సంబరాల మధ్య విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర శాసనసభ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా డ్యాన్స్ చేస్తూ  ఓ ఉద్యోగి అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారందరిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

    వివరాల్లోకి వెళితే కేరళ శాసనసభ(Kerala Legislative Assembly)లో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న జునైస్(45), ఓనం వేడుకల్లో(Onam Celebrations) ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపై తన సహచరులతో కలిసి నృత్యం చేస్తున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా కుప్పకూలిపోయారు. గమనించిన ఇతర ఉద్యోగులు వెంటనే అతడిని తిరువనంతపురంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు.

    Onam Festival | డ్యాన్స్ చేస్తూ..

    జునైస్​ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించారు. జునైస్ వయనాడ్ జిల్లా వాసి. గతంలో మాజీ ఎమ్మెల్యే పీవీ అన్వర్‌కి వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడం, వెంటనే తోటి ఉద్యోగులు పరుగు తీయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇంతవరకూ జునైస్ మృతికి గల ఖచ్చితమైన కారణం బయటపడలేదు. అయితే ఇటీవల ఇదే తరహాలో వేదికలపై గుండెపోటు(Heart Attack)తో కుప్పకూలే ఘటనలు పెరుగుతున్నాయి.

    ఈ ఘటనపై సహచర ఉద్యోగులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు. అయితే ఆట‌లాడుతున్న‌ప్పుడు, డ్యాన్స్‌లు చేస్తున్న‌ప్పుడు కుప్ప‌కూలి మ‌ర‌ణిస్తున్న సంఘ‌ట‌న‌లు మ‌నం చాలా చూశాం. అప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్‌గా ఉన్న‌వారు ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోవ‌డంతో తోటి వారికి ఏం తోచ‌డం లేదు. ఆసుపత్రికి తీసుకువెళితే అప్ప‌టికే చ‌నిపోయార‌ని చెబుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లకి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్​ అయ్యాయి.

     

    View this post on Instagram

     

    A post shared by Manorama Online (@manoramaonline)

    More like this

    September 3 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 3 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 3,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Teenmar Mallanna comments | ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న ఘాటైన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

    Teenmar Mallanna comments | భారాస నుంచి తిరస్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు...

    Pawan birthday celebrations | ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Pawan birthday celebrations : పవర్​ స్టార్ Power Star​, ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh ఉప...