అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పార్టీ నుంచి వేటు వేసిన విషయం తెలిసిందే.
కవిత(MLC Kavitha) కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఆమె తీరుతో పార్టీకి నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్(KCR) కుమార్తె కావడంతో ఎవరూ కూడా బయట మాట్లాడే సాహసం చేయలేదు. కొందరు మాత్రం సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. తాజాగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
MLC Kavitha | ఫ్లెక్సీల తొలగింపు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి అక్రమాలకు హరీశ్‌రావు(Harish Rao), సంతోష్‌రావు(Santosh Rao) అని వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆమెపై వేటు వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లను గులాబీ శ్రేణులు తొలగిస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) కవితకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. హరీశ్ రావుపై కవిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLC Kavitha | స్వాగతిస్తున్నాం
పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోడానికి వెనకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయమని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే(Former MLA Hanmant Shinde) అన్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.