అక్షరటుడే, ఆర్మూర్: Kaleshwaram | కాళేశ్వరం పైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ (CBI investigation) చేయించడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు.
ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి (Revanth Reddy government) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు సుంకరి రవి, పోల సుధాకర్, నచ్చు చిన్న రెడ్డి, జీజీ రాం, సత్యం, అగ్గు క్రాంతి, గుంజల పృథ్వీ, హాజీం, లతీఫ్, హర్షద్, మహమ్మద్ కైఫ్, రహ్మద్, ఇంద్రపు, విజయ్, నాగరాజు, సాంబాడి ఆనంద్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
Kaleshwaram | కోటగిరిలో..
అక్షరటుడే, కోటగిరి: Kaleshwaram | కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు (BRS leaders) కార్యకర్తలు మంగళవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి మహానాయకుడిపై సీబీఐ విచారణ పేరుతో వేధించడం సరికాదన్నారు.
ఈ విషయంలో రాష్ట్రంలోని సీఎంతో సహా మంత్రులను, ఎమ్మెల్యేను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మండల నాయకులు మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, తెల్ల రవికుమార్, పోతంగల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూదాం నవీన్, సామాజిక సేవా కార్యకర్త ఎంఏ హకీం, మోరే కిషన్, బొట్టే గజంధర్, గజంధర్, సంతోష్, ఆరిఫ్, ఎజాజ్, శ్రీనివాస్ గౌడ్, సమీర్, నజీర్, తేళ్ల చిన్న అరవింద్, మహేష్ రెడ్డి మామిడి నవీన్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
