అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ నగరంలోని డీ-4 సెక్షన్ D4 Section కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (Electricity problem resolution platform) సీజీఆర్ఎఫ్–2 (CGRF) ఏర్పాటు చేసినట్లు డీఈ శ్రీనివాసరావు, ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు.
బోర్గాం Boragam p, వినాయక్ నగర్ Vinayak nagar, నాగారం Naagaram సెక్షన్లకు చెందిన విద్యుత్ వినియోగదారులు సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ఉంటుందన్నారు. ఛైర్మన్ నారాయణ, కమిటీ సభ్యులు రామకృష్ణ, కిషన్, సీజీఆర్ఎఫ్ ఫోర్త్ మెంబర్ రాజా గౌడ్ హాజరవుతారని పేర్కొన్నారు.