అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చాలని సూచించింది.
ఈ మేరకు పది అంశాలతో కూడిన లేఖను ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. లేఖలో కాగ్, విజిలెన్స్, ఎన్‌డీఎస్ఏ నివేదిక(NDSA Report)లను లేఖలో ప్రస్తావించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాలని కోరింది.
Kaleshwaram Project | అంతులేని అవినీతి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర అవినీతి జరిగిందని ప్రభుత్వం తెలిపింది. అవినీతి, నాణ్యతలోపం, మెయింటెనెన్స్‌లో నిర్లక్ష్యంపై కాగ్, ఎన్‌డీఎస్ ఏ, విజిలెన్స్ నివేదికలు స్పష్టం చేశాయని ప్రభుత్వం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని పలు దర్యాప్తుల్లో తేలిందని గుర్తు చేసింది. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణంలో వైఫల్యం చెందిందని ఎన్‌డీఎస్ ఏ తెలిపిందని పేర్కొంది. తీవ్ర అవినీతి, నిర్లక్ష్యం వల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపింది. కాళేశ్వరం అక్రమాలపై పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) కూడా విచారణ జరిపి, అవినీతి, నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ అవసరమని ప్రభుత్వంతో పాటు అసెంబ్లీ కూడా అభిప్రాయపడిందని తెలిపింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. సీబీఐకి కేసు(CBI Case) బదిలీ చేస్తూ జీవో నంబర్104ను సోమవారమే విడుదల చేసింది.
Kaleshwaram Project | గత జీవో రద్దు..
సీబీఐ కి అనుమతి రద్దు చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్ సర్కారు వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా 2022 ఆగస్టు 30న కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 51ను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తాజాగా రద్దు చేసింది. ఈ మేరకు జనరల్ కన్సెంట్ ఇస్తూ ప్రభుత్వం కొత్తగా జీవో జారీ చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తులపై విచారణ జరిపేందుకు అనుమతిస్తున్నట్లు జీవోలో పేర్కొంది.