ePaper
More
    HomeజాతీయంAAP MLA | పోలీసుల‌పై ఆప్ ఎమ్మెల్యే కాల్పులు.. క‌స్ట‌డీ నుంచి ప‌రారీ

    AAP MLA | పోలీసుల‌పై ఆప్ ఎమ్మెల్యే కాల్పులు.. క‌స్ట‌డీ నుంచి ప‌రారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AAP MLA | అత్యాచారం కేసులో అరెస్టు అయిన ఆప్ ఎమ్మెల్యే(AAP MLA) పోలీసుల‌పై కాల్పుపు జ‌రిపి, ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లో మంగ‌ళ‌వారం తీవ్ర‌ క‌ల‌క‌లం రేపింది. రెండు వాహనాల్లో పారిపోయిన ఎమ్మెల్యే, అతని అనుచ‌రుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

    అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సనూర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్‌మజ్రా(Harmeet Pathanmajra)ను పోలీసులు మంగ‌ళ‌వారం కర్నాల్‌లో అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతన్ని తీసుకెళ్తుండగా, పఠాన్‌మజ్రా, అతని అనుచ‌రులు పోలీసు బృందం(Police Team)పై కాల్పులు జరిపారు. ఒక పోలీసు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు అతనిని ఢీకొట్టి రెండు వాహ‌నాల్లో పారిపోయారు.తేరుకున్న పోలీసులు ఓ వాహ‌నాన్ని అడ్డుకున్న‌ప్ప‌టికీ, ఎమ్మెల్యే మరో వాహనంలో ప‌రార‌య్యారు. పోలీసు బృందాలు అతడి వాహ‌నాన్ని వెంబడించాయి.

    AAP MLA | అనేక ఆరోప‌ణ‌లు..

    ఎమ్మెల్యే పఠాన్‌మజ్రాపై అనేక ఆరోప‌ణ‌లున్నాయి. అత్యాచారం, మోసం, బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌న్న‌ ఆరోపణలపే కేసులు న‌మోద‌య్యాయి. విడాకులు తీసుకున్నాన‌ని అబద్ధం చెప్పి తనతో సంబంధం పెట్టుకున్నాడ‌ని ఒక మహిళ ఆరోపించింది. లైంగిక దోపిడీకి పాల్ప‌డ‌మే కాకుండా అశ్లీల సందేశాలు పంపిస్తూ బెదిరింపులుకు పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు న‌మోదు చేశారు.

    AAP MLA | ప్ర‌భుత్వంపై గ‌తంలో విమ‌ర్శలు

    గతంలో, పంజాబ్‌(Punjab)లో వరదలు వ‌చ్చిన స‌మ‌యంలో ఆప్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. తనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వ‌చ్చి, భగవంత్ మాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వం పంజాబ్‌ను చట్టవిరుద్ధంగా పాలిస్తోందని ఆరోపించారు. వారు త‌న‌పై కేసులు పెట్టి జైలులో ఉంచ‌గ‌ల‌రేమో త‌న గొంతు నొక్క‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన తర్వాత తనకు భద్రతను త‌గ్గించార‌ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. “నేను నిన్న నా గన్ మెన్‌లను వెనక్కి పంపుతామని ఇప్పటికే చెప్పాను. ఢిల్లీ నాయకులు (ఆప్) విజిలెన్స్ (చర్య) లేదా ఎఫ్‌ఐఆర్‌లతో నన్ను భయపెట్టవచ్చని అనుకుంటున్నారు, కానీ నేను ఎప్పటికీ తలవంచను. నేను నా ప్రజలతో ఒక శిలలా నిలబడతాను” అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మాట వినాలి, లేకపోతే వారు త‌రిమి కొడతారని పఠన్‌మజ్రా హెచ్చ‌రించారు.

    More like this

    Teenmar Mallanna comments | ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న ఘాటైన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

    Teenmar Mallanna comments | భారాస నుంచి తిరస్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు...

    Pawan birthday celebrations | ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Pawan birthday celebrations : పవర్​ స్టార్ Power Star​, ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh ఉప...

    MLC Kavitha future | పొమ్మన్న పుట్టినిల్లు.. వద్దన్న మెట్టినిల్లు.. ఢోలాయమానంలో ఎమ్మెల్సీ కవిత భవిత!

    అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha future : ఇందూరు కోడలు, ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది....