అక్షరటుడే, వెబ్డెస్క్ : Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా లేదన్న వార్తలు చర్చనీయాంశంగా మారిన తరుణంలో, తాజాగా బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు కొత్త అనుమానాలకు దారితీశాయి.
వైట్ హౌస్(White House) బయట తీసిన పలు ఫొటోల్లో ట్రంప్ పూర్తిగా మారిపోయినట్టు కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తలపై జుట్టు చాలా మేర ఊడిపోయిందని, బట్టతల స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా, గతంలో చేతిపై కనిపించిన నల్ల మచ్చ ఇప్పుడు మరింత పెద్దదిగా కనిపించడంతో కలకలం రేగింది. ఈ మార్పులు చూసిన నెటిజన్లు, “ఇది నిజంగా ట్రంపేనా?” అనే స్థాయిలో ప్రశ్నిస్తున్నారు.
Donald Trump | టెన్షన్.. టెన్షన్
ట్రంప్(Donald Trump) కళ్లు ఉబ్బాయి. పెదవులు రంగు మారడంతో పాటు నడవడంలో అసమతుల్యత, కాలి చీలమండల వాపు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ తీవ్ర గుండె జబ్బు లక్షణాలు కావచ్చని అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాత్రం కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. ఈ అంశంపై వైట్ హౌస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడమే కాకుండా, ట్రంప్ కూడా పుకార్లపై స్పందించకపోవడం కొత్త అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి(Health Condition)పై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేకపోవడంతో, గుండె జబ్బు, క్యాన్సర్ వంటి సీరియస్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్న పుకార్లు ఊపందుకున్నాయి.
అలస్కాలో ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Putin) తో డోనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఆ కార్యక్రమంలో ట్రంప్ తూలుతూ నడిచిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా ఆయన శారీరక బలహీనతకు సూచనగా పేర్కొంటున్నారు కొందరు. ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ ప్రకటన చేయాలని ఆయన అభిమానులు, రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు.