అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan | సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు అభిమానులు, జన సైనికులు పవన్‌కి ప్రత్యేక విషెస్ తెలియజేస్తున్నారు.
దేశం పట్ల, సమాజం పట్ల విపరీతమైన అభిమానం ఉన్న పవన్ అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. అన్న రాజకీయ పార్టీ పెడితే ఊరూరా తిరిగి పార్టీ కోసం శ్రమించిన పవన్ ఆ తర్వాత సొంత పార్టీ(Janasena Party)ని స్థాపించి 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి మోదీ లాంటి వ్యక్తులే ఆయన్ని తుపానుతో పోల్చారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు పవన్ బర్త్ డే సందర్భంగా మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Pawan Kalyan | శుభాకాంక్షల వెల్లువ..
ఎంతో మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పవన్. సుపరిపాలనపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎన్డీయే NDAను బలోపేతం చేస్తున్న ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు చిరంజీవి తన తమ్ముడితో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ.. ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘సినీ రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందిస్తున్న కల్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల అభిమానంతో ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇక కొన్నాళ్లుగా పవన్‌కి కాస్త దూరంగా ఉంటూ వచ్చిన అల్లు అర్జున్(Allu Arjun) కూడా తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మన పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. మరోవైపు బండ్ల గణేష్.. “చరిత్రలో ఒకే ఒక్కడు. కోట్ల మంది గుండెల్లో ఆశాజ్యోతిగా మారిన మహోన్నత వ్యక్తి పవన్ కల్యాణ్. మీ పుట్టుకే ఒక అద్భుతం. హ్యాపీ బర్త్ డే మై బాస్” అని పేర్కొన్నారు.