అక్షరటుడే, ధర్పల్లి : Dharpalli | ధర్పల్లి(Dharpalli) మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి కత్తెరతో దాడి చేయడం కలకలం రేపింది.గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీ(NTR Colony)కి చెందిన వడ్ల గంగాధర్ భార్య మూడేళ్లుగా కాపురానికి రావడం లేదు. దీనికి గ్రామానికి చెందిన భోజేశ్వర్ లక్ష్మి కారణమని ఆయన కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమెను కత్తెర(Scissor)తో పొడిచాడు. అడ్డుగా వెళ్లిన మరో ముగ్గురిపై సైతం దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి(Nizamabad Government Hospital)కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.