ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు పలు జిల్లాలకు అతిభారీ వర్ష సూచన

    Weather Updates | నేడు పలు జిల్లాలకు అతిభారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రాన్ని వానలు వదలడం లేదు. కుండపోత వానలు సృష్టించిన బీభత్సం నుంచి తెరుకోకముందే.. మళ్లీ వర్షాలు పడుతున్నాయి.

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. మంగళవారం సైతం భారీ వానలు పడుతాయని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి గురువారం వరకు కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు కురుసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Weather Updates | ఆ జిల్లాలకు అలెర్ట్​

    ఆదిలాబాద్​, నిర్మల్​, ఆసిఫాబాద్​ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, ఉమ్మడి నిజామాబాద్​, ఉమ్మడి కరీంనగర్​, ఉమ్మడి మెదక్​, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్​ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి.

    హైదరాబాద్​ (Hyderabad) నగరంలో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు మాత్రమే పడుతాయి. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి పూట వర్షం పడే అవకాశం ఉంది. ఇటీవల భారీ వర్షాలు పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించినా.. హైదరాబాద్​లో మాత్రం పడలేదు. దీంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

    Weather Updates | దంచికొట్టిన వాన

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​లో 107.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇచ్చోడలో 103.8, గుడి హట్నూర్​ 97.5, తలమడ్ల 92.0, ఆసిఫాబాద్​ జిల్లా కెరిమెరిలో 88.0, ఆదిలాబాద్​ జిల్లా నార్నూర్​లో 87.0 మి. మీ. వర్షపాతం నమోదు అయింది.

    More like this

    Gampa Govardhan | పార్టీ గీత దాటితే ఎవరైనా ఒకటేనని నిరూపించారు : గంప గోవర్ధన్

    అక్షరటుడే, కామారెడ్డి : Gampa Govardhan | పార్టీ గీత దాటి వ్యవహరిస్తే ఎవరైనా ఒకటేనని ఎమ్మెల్సీ కవిత...

    Earthquake strikes Afghanistan | ఆఫ్ఘానిస్థన్​​లో మళ్లీ భూకంపం.. రెండు రోజుల వ్యవధిలో ఆరోసారి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Earthquake strikes Afghanistan : ఆఫ్ఘానిస్థాన్​ను వరుస భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఈ దేశంలో...

    CM Revanth reddy | 4న కామారెడ్డికి సీఎం రేవంత్​రెడ్డి..!

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: CM Revanth reddy | కామారెడ్డిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అలాగే ఎల్లారెడ్డి (Yellareddy),...