ePaper
More
    Homeక్రీడలుMitchell Starc | T20 ఇంటర్నేషనల్‌కు మిచెల్ స్టార్క్ గుడ్‌బై.. 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా...

    Mitchell Starc | T20 ఇంటర్నేషనల్‌కు మిచెల్ స్టార్క్ గుడ్‌బై.. 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mitchell Starc | ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchel Starc) కీలక నిర్ణయం తీసుకున్నాడు. 12 ఏళ్ల పాటు టీ20 ఇంటర్నేషనల్‌ క్రికెట్ (T20 International cricket) ఆడిన స్టార్క్ , ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

    35 ఏళ్ల స్టార్క్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, వచ్చే మూడు కీలక క్రికెట్ ఈవెంట్లపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్ (Test Cricket) నా అత్యుత్తమ ప్రాధాన్యత. ఆస్ట్రేలియా తరఫున టీ20లలో ఆడిన ప్రతి నిమిషాన్ని నేను ఆస్వాదించాను. 2021లో ప్రపంచ కప్ గెలవడం ఎంతో గొప్ప అనుభవం. కానీ ఇప్పుడు, భారత్ టెస్ట్ టూర్, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచ కప్ వంటి ప్రధాన టోర్నీల కోసం సన్న‌ద్ధ‌మ‌వుతున్నాను. ఫిట్‌గా ఉండాలంటే ఇది సరైన సమయం అని స్టార్క్ తన ప్రకటనలో తెలిపాడు.

    Mitchell Starc | రాబోయే షెడ్యూల్‌కు సిద్ధం..

    జూన్, 2024 లో భారత్(India)తో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు స్టార్క్. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్ నా మొదటి ప్రాధాన్యతగా భావిస్తున్నాను. నేను ఆస్ట్రేలియా తరపున ఆడిన ప్రతి టీ20 మ్యాచ్ లో ప్ర‌తి నిమిషం ఎంజాయ్ చేశాను. ఆస్ట్రేలియా (Autralia) వచ్చే ఏడాది టెస్ట్ క్రికెట్ తో బిజీ కానుంది. బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా టూర్, న్యూజిలాండ్ తో 4 మ్యాచ్ ల సిరీస్ ఆడ‌నుంది.

    ఆ త‌ర్వాత జ‌న‌వరి 2027 లో భారత్ లో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది, ఇది ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (ICC World Test Championship) పరంగా చాలా కీలకం కానుంది. ఇక‌ దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలలో ODI ప్రపంచ కప్ 2027 జ‌ర‌గ‌నుండ‌గా, ఆసీస్ జ‌ట్టు డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతుంది. ఈ క్రమంలోనే టెస్ట్, వన్డేలకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

    ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. స్టార్క్ టీ20 కెరీర్ గురించి మేమంతా చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాం. 2021 ప్రపంచ కప్ విజేత జట్టులో అత‌ను కీలక సభ్యుడు కాగా, ఆయ‌న‌ ఎక్కువ కాలం టెస్ట్, వన్డే క్రికెట్ (Test and ODI cricket) ఆడాలని భావించి ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప‌ విషయం అని అన్నారు. సెప్టెంబర్, 2012 లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా మిచెల్ స్టార్క్ తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేయ‌గా, వరి టీ20 భారత్ తో జూన్ 24, 2024న ఆడాడు. 12 సంవత్సరాల టీ20 కెరీర్లో మిచెల్ స్టార్క్ 65 టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా, స్టార్క్ ఖాతాలో 79 టీ20 వికెట్లు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో అతను 5 వికెట్ల హాల్ సాధించలేదు.

    More like this

    Collector Nizamabad | అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించి...

    Gampa Govardhan | పార్టీ గీత దాటితే ఎవరైనా ఒకటేనని నిరూపించారు : గంప గోవర్ధన్

    అక్షరటుడే, కామారెడ్డి : Gampa Govardhan | పార్టీ గీత దాటి వ్యవహరిస్తే ఎవరైనా ఒకటేనని ఎమ్మెల్సీ కవిత...

    Earthquake strikes Afghanistan | ఆఫ్ఘానిస్థన్​​లో మళ్లీ భూకంపం.. రెండు రోజుల వ్యవధిలో ఆరోసారి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Earthquake strikes Afghanistan : ఆఫ్ఘానిస్థాన్​ను వరుస భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఈ దేశంలో...