అక్షరటుడే, బాన్సువాడ: NREGA | కామారెడ్డి జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ల నూతన కార్యవర్గాన్ని గురువారం బాన్సువాడలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడిగా గంగాధర్ (బాన్సువాడ), కార్యదర్శిగా జగదీశ్వర్ రెడ్డి(సదాశివనగర్). కోశాధికారిగా భాస్కర్ (రాజంపేట) ఉపాధ్యక్షులుగా ముజీబ్, బలరాం, రాజు, చంద్రశేఖర్, నరేశ్, కార్యవర్గ సభ్యులుగా లింగం, సాయిలు, రాజు, లావణ్య, స్వప్న, సత్య ప్రసాద్, బాలాజీ, శ్రీకాంత్, సలహాదారులుగా సంతోష్, ఆనంద్, హకీమ్, నర్సయ్య ఎన్నికయ్యారు.
