అక్షరటుడే, వెబ్‌డెస్క్: sudan landslide : అంతర్గత కలహాతో అట్టడుకుపోతున్న ఆఫ్రికా దేశం African country సూడాన్ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకోవడంతో అంతా ఉలిక్కిపడ్డారు.
పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత Marra mountain ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) ఒక్కసారి విరిగి విధ్వంసం సృష్టించడంతో వెయ్యి మందికిపైగా మరణించారు.
స్థానికంగా నివసిస్తున్నవారిలో ఒకే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని సమాచారం. ఈ హృదయవిదారక ఘటనను సూడాన్ లిబరేషన్ మూమెంట్/ఆర్మీ (SLM/A) వెల్లడించింది.
గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో, పర్వత ప్రాంతంలోని మట్టి మెత్తబడి, భారీగా కొండచరియలు విరిగిపడినట్లుగా తెలుస్తోంది.
sudan landslide : ఘోర ప్రమాదం..
పశ్చిమ డార్ఫర్‌లోని ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇక మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారని అబ్దెల్వాహిద్ మహ్మద్ నూర్ బృందం తెలియజేసింది.
ఈ ప్రమాదంలో కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు సాయం చేయాలంటూ ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
కాగా, ఉత్తర డార్ఫర్‌లో సైన్యానికి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)కు మధ్య కొన్నాళ్లుగా అంతర్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వలస వెళ్లాల్సి వచ్చింది. అయితే ప్రకృతి విపత్తులో వారంతా మరణించడం అందరిని కలచి వేస్తోంది.
ప్రస్తుతం అక్కడ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సహాయక చర్యలు ప్రారంభం కావాల్సిన ఈ సమయంలో.. రహదారి పరిస్థితులు, భద్రతా సమస్యలు ఆటంకం కలిగిస్తున్నాయి.
అంతర్జాతీయ సమాజాన్ని, ఐక్యరాజ్యసమితిని వెంటనే స్పందించి సహాయం అందించాలని సూడాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికీ మరణించినవారి కచ్చిత సంఖ్య (Numbers) తెలియరాలేదు.
ఎన్‌జీవోలు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శిథిలాల కింద ఇంకా కొన్ని డజన్ల మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు