అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ Telangana రాష్ట్ర అపెక్స్ కమిటీ మెంబర్ మామిండ్ల అంజయ్య డిమాండ్ చేశారు.
కామారెడ్డి Kamareddy జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి, కుర్దు తదితర గ్రామాల్లో సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా heavy rains వల్ల జరిగిన గురించి మాట్లాడారు.
Apex Committee : తక్షణమే అందించాలి..
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు కూలిన రైతులకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని పేర్కొన్నారు.
అంజయ్య వెంట లింగంపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు గుండా బాలకిషన్, పోకల మల్లయ్య, రాములు, అంజయ్య, కొత్త పోచయ్య, హనుమాండ్లు తదితరులు ఉన్నారు.