అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం సృష్టించాయి. వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి. వినాయక చవితి నాడు కురిసిన భారీ వర్షాల (Heavy rains) కు కామారెడ్డి అతలాకుతలం అయింది. భారీ వర్షంతో వరదలు (Flood) పోటెత్తాయి.
చెరువులు, కుంటలు నిండిపోయి పొంగ్లిపొర్లాయి. రోడ్లపై వరద చేరి చెరువులు, నదులను తలపించాయి. అనేక చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా కామారెడ్డి పట్టణం వరదల్లో చిక్కుకుపోయింది. పలు మండలాల్లోనూ వరదలు పొంగిపొర్లాయి. కార్లతోపాటు మనుషులు కొట్టుకుపోయారు. ఉవ్వెత్తున ముంచుకొచ్చిన వరద వల్ల జాతీయ రహదారి మూసుకుపోయింది.
Paranjyoti Ammavaru : నెట్టింట వైరల్..
కాగా.. కామారెడ్డిలో సోమవారం (సెప్టెంబరు 1) మధ్యాహ్నం కూడా వర్షం పడింది. అయితే ఆ సమయంలో పట్టణంలోని కల్కినగర్లో ఉన్న పరంజ్యోతి భగవాన్ అమ్మవారి ఆలయంలో వింత జరిగింది. అమ్మ భగవాన్ విగ్రహం కంట్లో నుంచి కన్నీరు tears కారినట్లు భక్తులు చెబుతున్నారు.
అమ్మవారి Goddess కంటి నుంచి కన్నీళ్లు రావడంతో.. ఆ వెంటనే వర్షం ఆగిపోయిందని భగవాన్ భక్తులు పేర్కొంటున్నారు. ఇది అమ్మవారి కరుణా కటాక్షంగా ప్రచారం చేస్తున్నారు. కాగా.. అమ్మవారి కంట నీరు కారుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.