అక్షరటుడే, డిచ్పల్లి: Leopard dies : జాతీయ రహదారిపై వన్యప్రాణి wildlife animal బలైంది. నిజామాబాద్ Nizamabad జిల్లాలో మరో చిరుత మృతి చెందింది.
జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి (National Highway No. 44) పై చిరుత Leopard రోడ్డు ప్రమాదానికి గురైంది.
హైవేపై సోమవారం (సెప్టెంబరు 1) సాయంత్రం తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృతి చెందింది.
ఈ ప్రమాదానికి సమీపంలో ఏడో బెటాలియన్ రిజర్వ్ ఫారెస్టు Reserve Forest ఉంది. అందులో నుంచి వస్తూ రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ప్రాంతాన్ని జక్రాన్పల్లి ఎస్సై మాలిక్ రహమాన్ సందర్శించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇటీవలే ఇందల్వాయిలో..
కాగా.. సుమారు రెండు నెలల క్రితం సైతం ఇందల్వాయి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అది అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా గత నాలుగు నెలల క్రితం సైతం గాంధారి ఎక్స్ రోడ్డు సమీపంలో సైతం గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత గాయపడిన విషయం తెలిసిందే.