ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | అందరి సహకారంతోనే సాధారణ స్థితికి..

    Kamareddy SP | అందరి సహకారంతోనే సాధారణ స్థితికి..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో భారీ వరదలు (Heavy Floods) బీభత్సం సృష్టించాయని, అయితే, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సహకారం, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో జిల్లాలో మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చిందని ఎస్పీ రాజేష్‌ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు.

    జీఆర్‌ కాలనీలో (GR Colony) వరదల సమయంలో కృషి చేసిన జేసీబీ డ్రైవర్లు, వాలంటీర్లు, యువత, మున్సిపల్‌ సిబ్బందికి సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో (Police Station) సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు. ప్రజలు, వాలంటీర్లు, జేసీబీ డ్రైవర్లు, యువత, మున్సిపల్‌ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి పనిచేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ, రూరల్, భిక్కనూర్‌ సీఐలు నరహరి, సీఐ రామన్, సంపత్‌ కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు...

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ...

    West Godavari | వినాయ‌క నిమ‌జ్జ‌నంలో అశ్లీల నృత్యాలు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న హిందూ సంఘాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: West Godavari | ఆంధ్రప్రదేశ్‌లో రికార్డింగ్ డ్యాన్సులు (Recording Dance), ప్రత్యేకంగా అశ్లీల నృత్యాలు, రోజురోజుకు...