ePaper
More
    HomeతెలంగాణCompensation | ప్రభుత్వం కీలక ప్రకటన.. వరద మృతులకు రూ.5 లక్షల పరిహారం

    Compensation | ప్రభుత్వం కీలక ప్రకటన.. వరద మృతులకు రూ.5 లక్షల పరిహారం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Compensation | భారీ వర్షాలు (Heavy Rains) ఇటీవల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగస్టు 26న రాత్రి నుంచి 28 వరకు కుండపోత వానలు కురిశాయి.

    రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్​, నిజామాబాద్​, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా వినాయక చవితి రోజు అతి భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తింది. చాలా గ్రామాలు నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల దాటికి పలువురు మృతి చెందారు. పశువులు సైతం నీట మునిగి చనిపోయాయి.

    Compensation | అండగా ప్రభుత్వం

    భారీ వరదలతో (Floods) మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఉండగా నిలవాలని నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Reavanth Reddy) ఆదేశించారు. అలాగే వరదలకు మృతి చెందిన పశువులకు సైతం పరిహారం ఇవ్వాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. మళ్లీ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమగ్ర నివేదిక కేంద్రానికి అందజేయాలని ఆయన సూచించారు.

    గతేడాది భారీ వర్షాలకు జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆరా తీశారు. తక్షణమే కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలన్నారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

    Compensation | పలువురు మృతి

    వరదలతో పలువురు మృతి చెందారు. మెదక్​ (Medak) జిల్లా హవేలి ఘన్​పూర్​ మండలం రాజ్​పేట గ్రామానికి చెందిన ఇద్దరు వాగులో కొట్టుకుపోయి చనిపోయారు. కామారెడ్డిలో సైతం పలువురు మృతి చెందారు. అలాగే మెదక్​ జిల్లా దూప్​సింగ్​ తండాలో పశువులు వరదకు కొట్టుకుపోయాయి. రాజంపేట మండలంలోని పలు తండాల్లో సైతం పశువులు వాగులో కొట్టుకుపోయాయి. ఈ మేరకు బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించాలని నిర్ణయించింది.

    More like this

    CM Revanth Reddy | విపత్తుల నిర్వహణలో కామారెడ్డి మోడల్​గా నిలవాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | వరదలకు సంబంధించి అంచనాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు...

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ...