ePaper
More
    HomeజాతీయంSupreme Court | ఈసీ, పార్టీల మధ్య లోపించిన విశ్వాసం.. ఇది దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు

    Supreme Court | ఈసీ, పార్టీల మధ్య లోపించిన విశ్వాసం.. ఇది దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య పరస్పర విశ్వాసం లోపించిందని, ఇది దురదృష్టకరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision)ను పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది.

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు గడువు పెంచాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది. గడువును పొడిగించడం వల్ల అంతులేని ప్రక్రియ ఏర్పడుతుందని, నిబంధనల ప్రకారం నిర్ణయించిన మొత్తం షెడ్యూల్ను పట్టాలు తప్పే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈసీ జారీ చేసిన నోట్ పై తమ ప్రతిస్పందనలను సమర్పించడానికి రాజకీయ పార్టీలకు అనుమతించింది.
    ఓటర్లు, రాజకీయ పార్టీలు క్లెయిమ్లు, అభ్యంతరాలను దాఖలు చేయడంలో సహాయం చేయడానికి పారా-లీగల్ వాలంటీర్లను నియమించాలని అత్యున్నత న్యాయస్థానం బీహార్ లీగల్ సర్వీస్ అథారిటీ(Bihar Legal Service Authority)ని ఆదేశించింది.

    Supreme Court | గడువు తర్వాత కూడా అనుమతి..

    విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిణామాలు, గత విచారణ నాటి పరిస్థితులను బట్టి ఎన్నికల సంఘం(Election Commission), రాజకీయ పార్టీ(Political Parties)ల మధ్య విశ్వాసం లోపించినట్లు కనిపిస్తోందని తెలిపింది. బీహార్ SIRపై గందరగోళం తీవ్ర విశ్వసనీయమైన సమస్య’అని పేర్కొన్న ధర్మాసనం రాజకీయ పార్టీలు తమను తాము ‘యాక్టివేట్’ చేసుకోవాలని హితవు పలికింది. అయితే, బీహార్లో ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించిన వాదనలు, అభ్యంతరాలు, దిద్దుబాట్లను సెప్టెంబర్ 1 గడువు తర్వాత అనుమతిస్తామని ఎన్నికల సంఘం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. పత్రాలు అసంపూర్ణంగా ఉన్న ఓటర్లకు 7 రోజుల్లోపు నోటీసులు జారీ చేయడం నిరంతర ప్రక్రయిన అని పేర్కొంది. బీహార్ SIR లో మొత్తం 2.74 కోట్ల మంది డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మొత్తం 99.5 శాతం మంది అర్హత పత్రాలను దాఖలు చేశారని పేర్కొంది.

    Supreme Court | తొలగింపునకు నాలుగు కారణాలు

    ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించడానికి ఈసీ నాలుగు ప్రధాన కారణాలను పేర్కొంది. 25 లక్షల మంది వలస వెళ్లినట్లు గుర్తించి తొలగించామని, అలాగే, 22 లక్షల మంది మరణించినట్లు గుర్తించి తొలగించినట్లు తెలిపింది. 9.7 లక్షల మంది ఆయా చిరునామాలలో లేరని తెలిపింది. 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో నమోదు చేసుకున్నందుకు తొలగించినట్లు వివరించింది.

    Latest articles

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    Leopard dies | జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత దుర్మరణం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Leopard dies : జాతీయ రహదారిపై వన్యప్రాణి wildlife animal బలైంది. నిజామాబాద్​ Nizamabad జిల్లాలో...

    More like this