ePaper
More
    HomeతెలంగాణTelangana Education Committee | తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు కమిటీ ఏర్పాటు

    Telangana Education Committee | తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు కమిటీ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Education Committee | తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నూతన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రాష్ట్ర నూతన విద్యా విధానానికి సంబంధించిన నివేదిక రూపొందించనుంది.

    ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్య తదితర సంస్కరణలను సూచించనుంది. అంతేకాకుండా జాతీయ విద్యావిధానం (National Education Policy) 2020లోని నంబంధనలను అధ్యయనం చేసి.. వాటిని తెలంగాణకు అనుగుణంగా చేయాల్సిన మార్పులపై పలు సూచనలు చేయనుంది. కమిటీ తన నివేదికను అక్టోబర్​ 30వ తేదీలోగా సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. మొత్తం ఏడుగుల సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.

    తెలంగాణ విద్యా విధానం కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావు (Government advisor Dr. Kesava Rao) నియమితులయ్యాయరు. కమిటీలో ఛైర్మన్ సహా మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. కడియం శ్రీహరి, ఆకునూరి మురళీ, సీఎస్ రామకృష్ణారావు, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాల కిష్టారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు.

    Telangana Education Committee | కమిటీ సభ్యులు..

    డా. కేశవరావు, సలహాదారు – ఛైర్‌పర్సన్
    డా. కడియం శ్రీహరి, MLA – సభ్యుడు
    శ్రీ అకునూరి మురళి, IAS – ఛైర్మన్, TGEC – సభ్యుడు
    శ్రీ కె. రామకృష్ణారావు, IAS, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి – సభ్యుడు
    డా. యోగితా రాణా, IAS, విద్యాశాఖ కార్యదర్శి – సభ్యుడు, కన్వీనర్
    ప్రొ. బాల కిష్టారెడ్డి, ఛైర్మన్, TGHEC – సభ్యుడు
    ఛైర్‌పర్సన్ కోరుకున్న ఇతర సభ్యులు

    More like this

    CM Revanth Reddy | వరద బాధితులను ఆదుకుంటాం : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | భారీవర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ...

    Indalwai | యూరియా, ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Shashi Tharoor | అది అమెరికాకే మంచిది కాదు.. ట్రంప్‌కు శశిథరూర్ హెచ్చరిక..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన శిక్షాత్మక సుంకాలు భారతదేశాన్ని...