ePaper
More
    HomeజాతీయంCM Revanth Reddy | చంద్రబాబు, పవన్, కేసీఆర్, జగన్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి.. రేసు...

    CM Revanth Reddy | చంద్రబాబు, పవన్, కేసీఆర్, జగన్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి.. రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారనుందా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ జూలై 22న తన పదవికి రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు తదుప‌రి ఉప రాష్ట్ర‌ప‌తి ఎవ‌రు అవుతారు అనే చ‌ర్చ జోరుగా న‌డుస్తుంది. మ‌రోవైపు ఆయా పార్టీలు త‌మ అభ్య‌ర్ధిని ఉప రాష్ట్ర‌ప‌తిగా చేయాలంటూ పిలుపునిస్తున్నాయి.

    ఈ క్ర‌మంలో తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచే అవకాశం ఇదేనని పేర్కొంటూ, ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy)ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. “ఇది ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు, ఇది తెలుగు ప్రజల గౌరవానికి సంబంధించి ఒక చారిత్రక అవకాశం” అని అన్నారు.

    CM Revanth Reddy | రేవంత్ రెడ్డి రిక్వెస్ట్..

    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandra Babu), ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  (Deputy CM Pawan Kalyan), మాజీ సీఎంలు కేసీఆర్(KCR), వైఎస్ జగన్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ .. వీరందరికీ ఒకే విజ్ఞప్తి. రాజకీయ భేదాల్ని పక్కన పెట్టి, జాతికి గౌరవం తీసుకొచ్చే విధంగా, మన తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాలి అని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి(Vice President) అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిను ప్రకటించిందని వెల్లడించిన రేవంత్, ఇది పార్టీలకు అతీతంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లను తొలగించాలన్న అభిప్రాయాలతో వచ్చే వారికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాయకుడిని ఎన్నుకోవడం అత్యవసరం అంటూ ఎన్డీయే అభ్య‌ర్ధికి వ్యతిరేఖంగా కూడా ప‌లు కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి .

    ఎన్నికలు, పార్టీ వ్యవహారాలపై ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. కానీ ఇప్పుడు మన తెలుగువాడు దేశ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వ‌చ్చింది. ఈ విష‌యంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది.” అని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్న గొప్ప న్యాయవాది. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలవాలన్న పిలుపు ఇప్పుడు తెలుగు ప్రజల మనసులను స్పృశిస్తోంది. కాగా, తాజాగా ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందంటూ ఇండియా బ్లాక్‌ ఉప రాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఎన్నికల సంఘం(Election Commission) అత్యున్నత వ్యవస్థ అని చెప్పిన ఆయ‌న‌, ఈ దేశంలోని ప్రజలు ముందు ఓటర్లు, తర్వాతనే పౌరులు అయ్యారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓటరు లిస్ట్ చిత్తు కాగితం అనుకుంటున్నారని సుదర్శన్ రెడ్డి ఒకింత‌ ఆందోళన వ్యక్తం చేశారు.

    More like this

    CM Revanth Reddy | వరద బాధితులను ఆదుకుంటాం : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | భారీవర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ...

    Indalwai | యూరియా, ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Shashi Tharoor | అది అమెరికాకే మంచిది కాదు.. ట్రంప్‌కు శశిథరూర్ హెచ్చరిక..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన శిక్షాత్మక సుంకాలు భారతదేశాన్ని...