ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి : సీపీ

    CP Sai Chaitanya | ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి : సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ఆసక్తి చూపితే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలోని ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్ (Indian Oil Corporation)​ సారథ్యంలో పోలీస్​శాఖ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) సీపీ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. మనరక్తం మరొకరి ప్రాణం కాపాడుతుందనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అందుకోసం ఎప్పుడు అవకాశం వచ్చినా రక్తదానం చేసేందుకు యువత ఉత్సాహంగా ముందుకు రావాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి పూర్ణచంద్రరావు, పోలీస్ వెల్ఫేర్ ఇన్​స్పెక్టర్​ తిరుపతి, రెడ్​క్రాస్ సొసైటీ ఛైర్మన్ ఆంజనేయులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు మోహన్ కిషోర్​, అరుణ్ కుమార్, అబ్దుల్ ఫర్హాజ్స్, మహేశ్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    CM Revanth Reddy | వరద బాధితులను ఆదుకుంటాం : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | భారీవర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ...

    Indalwai | యూరియా, ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Shashi Tharoor | అది అమెరికాకే మంచిది కాదు.. ట్రంప్‌కు శశిథరూర్ హెచ్చరిక..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన శిక్షాత్మక సుంకాలు భారతదేశాన్ని...